వేటకు ముహూర్తం ఖరారు
ABN , First Publish Date - 2022-12-31T01:55:21+05:30 IST
సుధీర్‌బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘హంట్’ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా...

సుధీర్‌బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘హంట్’ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్‌బాబు, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ‘చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యాయి. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయయాన్ విజియర్ మా చిత్రంలోని యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారు. త్వరలో ట్రైలర్ విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని చెప్పారు నిర్మాత ఆనంద ప్రసాద్. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: అరుల్ విన్సెంట్, సంగీతం: జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.