కోటీశ్వరులు కావడం ఎలా?

ABN , First Publish Date - 2022-08-23T05:48:27+05:30 IST

హాస్య నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకుడిగా అంజన్‌ చెరుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది....

కోటీశ్వరులు కావడం ఎలా?

హాస్య నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకుడిగా అంజన్‌ చెరుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుమిత కథానాయిక. రావుల లక్ష్మణ్‌ రావు, రావుల శ్రీను నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్‌ దర్శకుడు సాగర్‌ క్లాప్‌ కొట్టారు. రామసత్యనారాయణ స్విచ్చాన్‌ చేశారు. రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ మధ్య తరగతి జంట కథ ఇది. తమకొచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని కోటీశ్వరులు ఎలా అయ్యారు? అనేదే కథ. ఆద్యంతం హాయిగా సాగిపోతుంది. నిర్మాత ఇచ్చిన బడ్జెట్‌ కంటే తక్కువ బడ్జెట్‌లోనే ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నా’ అన్నారు. ‘‘కథ బాగా నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకొన్నట్టుగానే ఈ చిత్రాన్ని పూర్తి చేయగలమన్న నమ్మకం కుదిరింది. సెప్టెంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతామ’’ని నిర్మాతలు తెలిపారు. సంగీతం: త్రినాథ్‌ మంతెన. 


Updated Date - 2022-08-23T05:48:27+05:30 IST

Read more