అలిపిరి ఎంత దూరమంటే...?

ABN , First Publish Date - 2022-11-02T10:07:12+05:30 IST

నందిని రెడ్డి శిష్యుడు ఆనంద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’...

అలిపిరి ఎంత దూరమంటే...?

నందిని రెడ్డి శిష్యుడు ఆనంద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. రావణ్‌ నిట్టూరు, శ్రీ నిఖిత జంటగా నటించారు. ఈనెల 18న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు రమేశ్‌ డబ్బు గొట్టు, రెడ్డి రాజేంద్ర మాట్లాడుతూ ‘‘అలిపిరి నేపథ్యంలో సాగే సినిమా ఇది. ‘మా తిరుపతి’ పాటకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రచార కార్యక్రమాల్ని సైతం వినూత్నంగా నిర్వహిస్తున్నామ’’న్నారు. సంగీతం: ఫణి కల్యాణ్‌.


Updated Date - 2022-11-02T10:07:12+05:30 IST

Read more