సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Holy wound: ఇద్దరు అమ్మాయిల శృంగారం!

ABN, First Publish Date - 2022-08-09T20:29:05+05:30

జానకి సుందర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్‌ కీలక పాత్రల్లో సందీప్‌ ఆర్‌ మలయాళంలో నిర్మించిన చిత్రం ‘హోలీవుండ్‌’. అశోక్‌ ఆరాన్‌ దర్శకుడు. లెస్బియన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సైలెన్స్‌ సినిమా ఎన్నో వివదాల నడుమ ఈ నెల 12న ఓటీటీ ద్వారా విడుదల కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జానకి సుందర్‌(Janaki sunder), అమృతా వినోద్‌ (Amrutha vinod), సాబు ప్రౌదిక్‌  కీలక పాత్రల్లో సందీప్‌ ఆర్‌ మలయాళంలో నిర్మించిన చిత్రం ‘హోలీవుండ్‌’ (Holywound). అశోక్‌ ఆరాన్‌ దర్శకుడు. లెస్బియన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సైలెన్స్‌ సినిమా ఎన్నో వివదాల నడుమ ఈ నెల 12న ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సందీప్‌ ఆర్‌ మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిలు.. కొంత కాలంగా కలిసి ఉండటంతో వారిద్దరి శృంగారా భావాలు కలుగుతాయి. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ తరుణంలో వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది.  డీప్‌ ప్రేమలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ఎన్నో వివాదాలను దాటుకుని ఈ నెల 12న ఎస్‌ ఎస్‌ ఫ్రేమ్స్‌ ఓటీటీ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం.   మాటలు లేని ఈ సైలెన్స్‌ లెస్బియన్‌ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’’ అని అన్నారు. (OTT release)


Updated Date - 2022-08-09T20:29:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!