సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా పెళ్లికి – విడాకులకు నన్నూ పిలవండి ప్లీజ్‌..: హిమజ

ABN, First Publish Date - 2022-01-28T17:24:38+05:30

‘శతమానం భవతి’, ‘ధ్రువ’, మహానుభావుడు’ వంటి చిత్రాలతోపాటు ‘బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో పాపులర్‌ అరయ్యారు నటి హిమజ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమజ త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్త శుక్రవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఆమె స్పందించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ఆమె వస్తున్న గాసిప్‌లపై మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘శతమానం భవతి’, ‘ధ్రువ’, మహానుభావుడు’ వంటి చిత్రాలతోపాటు ‘బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో పాపులర్‌ అరయ్యారు నటి హిమజ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమజ త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్త శుక్రవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఆమె స్పందించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ఆమె వస్తున్న గాసిప్‌లపై మండిపడ్డారు.  ‘‘షూటింగ్‌లో నా పనిలో నేను బిజీగా ఉండగా సన్నిహితులు కొందరు కొన్ని వీడియో లింక్‌లు పంపారు. అందులో ‘హిమజ విడాకులు తీసుకుంటుంది’ అనే వార్త ఉంది. ఏంటో ఈ మధ్యన మనుషులతో ప్రమేయం లేకుండా యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు చేసి, విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వార్తల గురించి నేను పట్టించుకోను. కానీ ఇంట్లో తల్లిదండ్రులు కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వారి మనసు బాధపడుతుంది. దయచేసి ఇలాంటి పనులు మానుకోండి. అలాగే నాకు పెళ్లి చేసినా, విడాకులు ఇప్పించిన ఆ వేదికకు దయచేసి నన్నూ పిలవండి’’ అని వ్యంగ్యంగా చురకలు వేశారు. 




తప్పకుండా పెళ్లి చేసుకుంటా...

ప్రస్తుతం ఇండివిడ్యువల్‌గా నా పని నేను చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నా. కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటున్నా. ఓ నాలుగేళ్ల తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటా. మంచి గుళ్లో.. అందమైన పూల డెకరేషన్‌ మధ్య చాలా గ్రాండ్‌గా పెళ్లిని సెలబ్రేట్‌ చేసుకుంటా. కానీ ఒకరిని కామెంట్‌ చేసేటప్పుడు వారికి కుటుంబం ఉంటుంది,  తెలియకుండా చేసే కామెంట్ల వల్ల వారు బాధపడతారని గమనించండి’’ అని హిమజ వీడియోలో పేర్కొన్నారు. 





Updated Date - 2022-01-28T17:24:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!