సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chor Bazaar: సమంత వదిలిన ‘నూనుగు మీసాల’ పాట

ABN, First Publish Date - 2022-06-04T02:30:36+05:30

ఆకాష్ పూరి (Akash Puri), గెహన సిప్పీ (Gehna Sippi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చోర్ బజార్’ (Chor Bazaar). ‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకాష్ పూరి (Akash Puri), గెహన సిప్పీ (Gehna Sippi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చోర్ బజార్’ (Chor Bazaar). ‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జీవన్ రెడ్డి (Jeevan Reddy) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐ.వి ప్రొడక్షన్స్ (IV Productions) పతాకంపై వి.ఎస్ రాజు (VS Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో థియేటర్లలో విడుదలకానున్న  ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుండి తాజాగా ‘నూనుగు మీసాల’ (Noonugu Meesala) అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటని స్టార్ హీరోయిన్ సమంత తన ట్విట్టర్ వేదికగా విడుదల చేసి.. ‘ఈ పాట మీ అందరినీ ప్రేమలో పడేస్తుంది.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు’ అని తెలిపారు.


పాట గురించి చెప్పుకోవాలంటే.. హీరోయిన్ సోలో సాంగ్ ఇది. ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది నాయిక. 

‘‘నూనుగు మీసాల పోరడు చూడు ఎదురుసూరీడే, నామీద నజర్ ఏసిండే..  

రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే, వాని గుండెల్ల దాసిండే..

 వాని బొమ్మ గీసి.. 

మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో.. వాణ్ని చేరితే చాలయ్యో, 

మళ్లొస్తడాని.. 

బాట మీద కూసోనున్న.. ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో ...’’ అంటూ సాగిన ఈ పాటను సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) స్వరపరచగా.. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన (Lakshmi Meghana) పాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, ‘చోర్ బజార్’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.



Updated Date - 2022-06-04T02:30:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!