Hero Suryaపై Fir నమోదు
ABN , First Publish Date - 2022-05-18T15:38:17+05:30 IST
కోలీవుడ్ అగ్రహీరో సూర్యపై నగరంలోని వేళచ్చేరి పోలీస్ స్టేషనేలో కేసు (ఎఫ్ఐఆర్) నమోదైంది. ‘జైభీమ్’ చిత్రం వ్యవహారంలో హీరో సూర్యతో పాటు చిత్ర నిర్మాతల్లో ఒకరైన జ్యోతిక, దర్శకుడు

అడయార్(చెన్నై): కోలీవుడ్ అగ్రహీరో సూర్యపై నగరంలోని వేళచ్చేరి పోలీస్ స్టేషనేలో కేసు (ఎఫ్ఐఆర్) నమోదైంది. ‘జైభీమ్’ చిత్రం వ్యవహారంలో హీరో సూర్యతో పాటు చిత్ర నిర్మాతల్లో ఒకరైన జ్యోతిక, దర్శకుడు టీజే ఙ్ఞానవేల్లపై కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల హీరో, దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో ఇదే పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. కానీ, దానిపై పోలీసులు స్పందించలేదు. దీంతో ఆయన సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై విచారణ జరిపిన కోర్టు హీరో సూర్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు టీజే ఙ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాన్ని కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు వేళచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇదే వ్యవహారంలో వన్నియర్ సంఘం కూడా రూ.5 కోట్ల పరువు నష్టం లేదా బేషరతు క్షమాపణ కోరుతూ హీరో సూర్యకు నోటీసులు కూడా పంపించిన విషయం తెల్సిందే.