సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RUDRA: ఆనందంలో హీరో సుధాకర్ కోమాకుల ఫ్యామిలీ..

ABN, First Publish Date - 2022-05-21T18:03:52+05:30

నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) దంపతులకు మగబిడ్డ జన్మించాడు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) సినిమాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) దంపతులకు మగబిడ్డ జన్మించాడు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) సినిమాతో నటుగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు సుధాకర్ కోమాకుల. ఈ సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. అయితే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్లాపవడంతో ఆ తర్వాత ఆశించిన అవకాశాలు దక్కలేదు. నువ్వు తోపురా (Nuvvu Thopu Raa), కుందనపు బోమ్మ (Kundanapu Bomma) లాంటి చిత్రాలలో లీడ్ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు.


ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్, యువ నటుడు కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క చిత్రాలలో మంచి పాత్రలనే పోషించాడు. కాగా, సుధాకర్ కోమాకులకు హారిక సందెపోగు (Harika Sandepogu)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు మగబిడ్డ జన్మిచాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తమ బిడ్డకు 'రుద్ర కోమాకుల' (Rudra Komakula) అని నామకరణం చేసిన విషయాన్ని తెలిపారు.


ప్రస్తుతం సుధాకర్ కోమకుల దంపతులు చికాగోలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన బాబు జన్మించాడని ..తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.. అని తెలిపారు. అలాగే, 'రుద్ర' అంటే చెడును తరిమికొట్టేవాడు.. స్తుతించదగినవాడు, శివుని యొక్క మరొక పేరు మరియు రూపం'..అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక సుధాకర్ కోమాకుల -  హారికల పెళ్ళిరోజుకు సరిగ్గా వారంముందు బాబు పుట్టడంతో కుటుంబసభ్యులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. కాగా, ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సుధాకర్ కోమాకుల దంపతులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Updated Date - 2022-05-21T18:03:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!