Satyadev: తమన్నాని దృష్టిలో పెట్టుకునే ఆ డైలాగ్ రాశారు

ABN , First Publish Date - 2022-11-28T15:26:08+05:30 IST

యంగ్ హీరో సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) జంటగా న‌టించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam). ఈ చిత్రంతో క‌న్న‌డ‌లో

Satyadev: తమన్నాని దృష్టిలో పెట్టుకునే ఆ డైలాగ్ రాశారు

యంగ్ హీరో సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) జంటగా  న‌టించిన  సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam). ఈ చిత్రంతో క‌న్న‌డ‌లో స‌క్స‌ెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడైన నాగ‌శేఖ‌ర్‌ (NagaShekar) టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం.సుబ్బారెడ్ది సమర్పిస్తున్నారు. కాల‌భైర‌వ సంగీతాన్ని అందించారు.  ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలోని పాటను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..


హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ.. నేను కామెడీ, ల‌వ్ స్టోరిస్ బాగానే చేస్తానుక‌దా ఎందుకు నాకు కాన్సెప్ట్ చిత్రాలు లేదా పెద్ద క్యారక్ట‌రైజేష‌న్స్ ఇస్తున్నారని అనిపిస్తూ ఉండేది. అలాంటి టైమ్‌లో నాగ‌శేఖ‌ర్ నాకు ఈ క‌థ చెప్పాడు. కథ విన్న 10 నిమిషాల్లో నేను ఈ సినిమా చేస్తా అని చెప్పా.. కానీ నా ప‌క్క‌న హీరోయిన్ అంటే నిధి కేర‌క్ట‌ర్ ఎవ‌రు చేస్తారు అనుకుంటూ వున్నా. ఆ టైమ్‌లో నా మొబైల్‌కి ఒక మెసేజ్ వ‌చ్చింది. త‌మన్నా హీరోయిన్‌గా చేస్తున్నార‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. వావ్ అనిపించింది. అందుకే సినిమాలో ఒక డైలాగ్ పెట్టాము. త‌మ‌న్నాని సినిమాలో చూడ‌గానే ఇది మ‌న రేంజ్ కాదేమోరా అని. అలా చాలా నేచుర‌ల్‌గా మూడు ల‌వ్ స్టోరిస్ క‌లిపిన ఒక మంచి ల‌వ్ స్టోరీ మా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాలో త‌మ‌న్నా చేసిన పాత్ర.. ఇంతకు ముందు ఎప్పుడూ ఆమె చేయలేదు. ఇది మాత్రం నిజం. నిధి పాత్రని స‌త్య‌దేవ్ ఎంత‌లా ప్రేమిస్తాడో.. ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కులు అంత‌కి మించి ప్రేమిస్తారు. సుహాసిని సాంగ్ విజువ‌ల్స్ చూస్తే అంద‌రి ఫేవ‌రేట్ సాంగ్ అవుతుంది. రీసెంట్‌గా ‘గాడ్ ఫాద‌ర్’ చిత్రంలో చేసిన పాత్రకి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ ల‌వ్ స్టోరీని అంత‌కుమించి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. కావ్య శెట్టి, మేఘా ఆకాష్.. చాలా అందంగా న‌టించారు. ల‌క్ష్మీ భూపాల్ రాసిన మాట‌లు, స‌త్య అందించిన విజువ‌ల్స్‌, కాల‌భైర‌వ సంగీతం.. ఈ సినిమాని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ విడుదల చేయనున్నాం. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా తెలుగు‌లోనూ టాప్ డైర‌క్ట‌ర్స్‌లో ఒక‌రిగా నిల‌దొక్కుకుంటారు. అలాగే నిర్మాత‌లు ఈ సినిమా విష‌యంలో ఎన్ని వేవ్స్ వ‌చ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవ్వ‌డానికే ఇన్ని క‌ష్టాలు ప‌డిందేమో అనుకుంటున్నా. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రి హృదయాలను గెలుచుకుని.. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నానని అన్నారు. (Satyadev about Gurthunda Seethakalam Movie) 

Updated Date - 2022-11-28T15:26:08+05:30 IST