‘The Warriorr’ టీజర్: పాన్ ఇండియా సినిమాని చూశారు.. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?
ABN , First Publish Date - 2022-05-15T00:09:53+05:30 IST
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది వారియర్’ (The Warrior). తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి (N Linguswami) దర్శకత్వంలో రూపొందుతోన్న
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది వారియర్’ (The Warriorr). తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి (N Linguswami) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని.. పవన్ కుమార్ (Pavan Kumar) సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. తాజాగా హీరో రామ్ పుట్టినరోజు (మే 15)ను పురస్కరించుకుని చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ ను అందుకోవడమే కాకుండా.. టాప్ 1లో ట్రెండ్ అవుతోంది.
టీజర్ విషయానికి వస్తే..
‘‘ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం అప్ప! ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు వైలెంట్‌గా లోపలేస్తాండారు. ఈ మధ్య సత్య (Satya IPS) అని ఒకడు వచ్చున్నాడు... వాడియమ్మా! ఒక్కొక్కడికి పెడుతున్నాడు. కానీ, ఒకటప్పా... కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు. అట్టా కొడతాడు... టాబ్లెట్ ఇస్తాడు’ అని నటుడు రిడిన్ కింగ్స్లే (Redin Kingsley) ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు స్క్రీన్ మీద పవర్ఫుల్ యాక్షన్‌తో రామ్ ఎంట్రీని చూపించారు. యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్లో చోటిచ్చారు. ‘డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను’ అని కృతి శెట్టి (Krithi Shetty) చెప్పడమే కాదు, రామ్‌తో రొమాన్స్ చేయడమూ చూపించారు. ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం’ అంటూ.. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ఎంట్రీని పవర్‌ఫుల్‌గా చూపించారు. ఆయన మాస్ గెటప్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది.
‘పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?’.. ‘మై డియర్ గ్యాంగ్స్టర్స్ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచేలా ఉన్నాయి. అలాగే ‘ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చినవాళ్ళను కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం’ అని హీరో రామ్‌తో నదియా (Nadiya) చెప్పే డైలాగ్ చూస్తుంటే.. అందులో ఎమోషన్, ఫైర్... రెండూ కనిపిస్తున్నాయి. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో హీరో ఏం చేశాడు? ఎవరిని వెతుక్కుంటూ వెళ్లి కొట్టాడు? అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఓవరాల్‌గా.. మాస్... ఊర మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీజర్ చెప్పకనే చెప్పింది. యాక్షన్ ప్రియులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని రామ్, నదియా సీన్ చూస్తే తెలుస్తుంది. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సరికొత్తగా ఉన్నాయి. పాత్రలన్నింటినీ లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
చిత్ర టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. స్క్రీన్ మీద రామ్, స్క్రీన్ వెనుక లింగుస్వామి అద్భుతంగా చేశారు. ఊర మాస్ విజువల్ గ్రాండియర్ అని ఆడియన్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ పాటను ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. జూలై 14 (July 14)న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.