హీరో మెసేజ్‌

ABN , First Publish Date - 2022-06-16T05:34:07+05:30 IST

ఫిరోజ్‌ఖాన్‌, సనాఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య నటీనటులుగా రూపొందిన చిత్రం ‘యూ ఆర్‌ మై హీరో’. షేర్‌ దర్శకుడు....

హీరో మెసేజ్‌

ఫిరోజ్‌ఖాన్‌, సనాఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య నటీనటులుగా రూపొందిన చిత్రం ‘యూ ఆర్‌ మై హీరో’. షేర్‌ దర్శకుడు. మిన్ని నిర్మాత. వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్‌ మాట్లాడుతూ ‘తెలంగాణలో మంచి ప్రదేశాలు ఉన్నాయి. సినిమా షూటింగ్స్‌కు పర్యాటక శాఖ నుంచి సాయం అందిస్తామ’ని తెలిపారు. చిత్ర సమర్పకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ ‘హారర్‌, సస్పెన్స్‌, యాక్షన్‌ కలగలసిన చిత్రం ఇది’ అని చెప్పారు. ‘యూ ఆర్‌ మై హీరో’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి సందేశం ఇవ్వబోతున్నామని చిత్ర నిర్మాత తెలిపారు.

Updated Date - 2022-06-16T05:34:07+05:30 IST

Read more