సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kichcha Sudeep: నటుడు సుదీప్‌ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-11-26T20:32:38+05:30

బెంగళూరులోని తన నివాసంలో కర్ణాటక పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ (Prabhu Chauhan)తో కలిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఈగ’ (Eega) ఫేం కన్నడ నటుడు సుదీప్‌ (Kichcha Sudeep) 31 గోవులను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బెంగళూరులోని తన నివాసంలో కర్ణాటక పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ (Prabhu Chauhan)తో కలిసి గోపూజలు నిర్వహించారు. ప్రభుత్వం పుణ్యకోటి దత్తత ప్రచార రాయబారిగా తనను నియమించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తన పూర్వజన్మ సుకృతమని సుదీప్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని ప్రభుత్వ గోశాలల్లో తలా ఒక ఆవు చొప్పున 31 ఆవులను దత్తత తీసుకోవాలని నిర్ణయించానన్నారు. భావితరాల కోసం గోసంతతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) తన పుట్టినరోజు నాడే 11 ఆవులను దత్తత తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పుణ్యకోటి దత్తత పథకాన్ని ప్రారంభించడం తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని ఆయన వెల్లడించారు. 


ప్రతి గోవుకు ఏడాదికి రూ.11వేలు చెల్లించి ప్రజలెవరైనా దత్తత తీసుకోవచ్చునని మంత్రి ప్రభు చౌహాన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. గోవుల సంరక్షణ కోసం దాతల నుంచి కనీసం రూ.1000 కోట్లు సేకరించాలని తలపెట్టామని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా  స్వచ్ఛందంగా తమ ఒక రోజు జీతాన్ని పుణ్యకోటి దత్తు పథకానికి అందజేశారని మంత్రి తెలిపారు. (Kichcha Sudeep Takes Sensational Decision)

Updated Date - 2022-11-26T20:32:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!