యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ 8వ చిత్రం

ABN , First Publish Date - 2022-04-08T21:58:21+05:30 IST

యంగ్ హీరో కార్తికేయ చేస్తున్న 8వ చిత్రానికి సంబంధించిన వివరాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో

యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ 8వ చిత్రం

యంగ్ హీరో కార్తికేయ చేస్తున్న 8వ చిత్రానికి సంబంధించిన వివరాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుపుతూ.. అధికారికంగా ఓ పోస్టర్‌ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా వైవిధ్యభరితంగా ఉంది. ఇందులో కార్తికేయ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మధు శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నారు. సత్య జి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.Updated Date - 2022-04-08T21:58:21+05:30 IST

Read more