Japan: ఆసక్తికరంగా కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2022-11-15T00:34:16+05:30 IST

హీరో కార్తి (Karthi) కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మురుగన్

Japan: ఆసక్తికరంగా కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్

హీరో కార్తి (Karthi) కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. హీరో కార్తికి ఇది 25వ సినిమా. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ‌గా వుంది. ఈ ఫస్ట్ లుక్‌లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్సూట్లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తి ఎదురుగా మందు గ్లాస్‌తో సేదతీరుతున్న ఓ అమ్మాయిని కూడా ఈ పిక్‌లో గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్ ఫ్రేమ్‌లో మరొక డిఫరెంట్ గెటప్‌లో కార్తీ కనిపిస్తున్నారు. బంగారు చొక్కా, మెడలో గొలుసులను ధరించి, ఒక చేతిలో బంగారు తుపాకీని మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్‌ని పట్టుకున్నట్లుగా కనిపించడం క్యూరియాసిటీని పెంచింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Hero Karthi Movie Japan First Look)


ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ జోడి కడుతోంది. టాలీవుడ్ యాక్టర్ సునీల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సునీల్‌కి ఇది తొలి తమిళ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి  జివి ప్రకాష్ కుమార్ సంగీతం, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను  నిర్వహిస్తుండగా.. ‘మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా,  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.



Updated Date - 2022-11-15T00:34:16+05:30 IST