Yes Boss: హావిష్-అశోక్ మూవీ ఎక్స్‌క్లూజివ్ డిటైల్స్!

ABN , First Publish Date - 2022-09-28T03:12:11+05:30 IST

స్వీటీ అనుష్క (Anushka)తో చేసిన ‘భాగమతి’ (Bhaagamathie) చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు అశోక్ (Ashok).. ఇప్పుడు హావిష్ (Havish) హీరోగా..

Yes Boss: హావిష్-అశోక్ మూవీ ఎక్స్‌క్లూజివ్ డిటైల్స్!

స్వీటీ అనుష్క (Anushka)తో చేసిన ‘భాగమతి’ (Bhaagamathie) చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు అశోక్ (Ashok).. ఇప్పుడు హావిష్ (Havish) హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న.. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ ఏమిటంటే.. ఏ స్టూడియోస్ (A Studios) బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ (Satyanarayana Koneru) నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఎస్ బాస్’ (Yes Boss) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ (Akula Siva) ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. 


ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలు కానుందని తెలుస్తోంది. రవితేజ ‘ఖిలాడి’ (Ravi Teja Movie Khiladi) సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే. అనూప్ రూబెన్స్ (Anup Rubens) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘డీజే టిల్లు’ (DJ Tillu) కెమెరామెన్ సాయి ప్రకాష్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-09-28T03:12:11+05:30 IST