సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Harish Shankar: ఏదీ మిస్సవ్వదు.. నన్ను నమ్మండి..

ABN, First Publish Date - 2022-08-27T19:07:42+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pavan kalyan అభిమానులందరూ గత కొన్ని నెలలుగా ఎదుచూస్తున్న సినిమా భవదీయుడు భగత్‌సింగ్. కానీ, అన్నీ ఎదురుచూపులుగానే ఉన్నాయి తప్ప ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan kalyan) అభిమానులందరూ గత కొన్ని నెలలుగా ఎదుచూస్తున్న సినిమా భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu Bhagathsing). కానీ, అన్నీ ఎదురుచూపులుగానే ఉన్నాయి తప్ప ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం ఎటువైపునుంచీ క్లారిటీ రావడం లేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాన్ని సృష్ఠించిందో అందరికీ తెలిసిందే.


పవన్ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రాలలో గబ్బర్ సింగ్ కూడా ఒకటి. అందుకే, మైత్రీ మూవీ మేకర్స్ వీరి కాంబినేషన్‌లో చిత్రాన్ని ప్రకటిస్తూ భవదీయుడు భగత్‌సింగ్ అని టైటిల్ రివీల్ చేశారో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో సంతోషించారు. కానీ, ఈ ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా ఉందని చాలాసార్లు కన్‌ఫర్మ్ చేశారు. అయితే, పవన్ దృష్ఠి రాజకీయాలపై ఎక్కువగా ఉండటంతో సెట్స్‌పైన ఉన్న హరిహర వీరమల్లు చిత్రమే పూర్తి కాలేదు.


ఆయన మళ్ళీ అక్టోబర్ నుంచి పాదయాత్ర అని ఇటీవల ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ కాస్త కంగారుపడుతూ దర్శకుడు హరీష్ శంకర్‌కి ట్వీట్ చేశారు. దీనిలో ఓ అభిమాని 'ఆ స్టెప్‌లు ఆ స్వాగ్.. ఆ స్టైల్ ఏమైపోయాయ్ కళ్యాణ్ అన్నా.. హరీష్ శంకర్ అన్నా మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ.. నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ స్పందించాడు. "అన్నీ వుంటాయ్ .. ఏదీ మిస్సవ్వదు.. నన్ను నమ్మండి. మీ ఎదురుచూపులకు నా ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం వస్తుంది'' అని రిప్లై ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.  



Updated Date - 2022-08-27T19:07:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!