సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Harish Shankar: ఆలస్యమైంది.. కానీ చాలా హ్యాపీగా ఉంది

ABN, First Publish Date - 2022-08-05T05:16:10+05:30

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘సార్’ (Sir) (తమిళంలో ‘వాతి’) టీజర్‌పై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ టీజర్ చైతన్యం కలిగించేలానూ, అలాగే మాసీగానూ ఉందంటూ కామెంట్స్ చేశారు. ధనుష్, సంయుక్తా మీనన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘సార్’ (Sir) (తమిళంలో ‘వాతి’) టీజర్‌పై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ టీజర్ చైతన్యం కలిగించేలానూ, అలాగే మాసీగానూ ఉందంటూ కామెంట్స్ చేశారు. ధనుష్, సంయుక్తా మీనన్ (Samyuktha Menon) జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌పై వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్న చిత్రం ‘సార్’. ఈ చిత్ర టీజర్‌ని ధనుష్ పుట్టినరోజును పురస్కరించుకుని జూలై 28న విడుదల చేశారు. ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై కూడా భారీగా అంచనాలను పెంచేసింది. ఈ టీజర్‌ను కాస్త ఆలస్యంగా చూసిన హరీష్ శంకర్.. ‘ఆలస్యమైంది కానీ.. టీజర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. 


‘‘ధనుష్‌గారు నటించిన ‘సార్/వాతి’ టీజర్‌ను క్యాచ్ చేయడం కాస్త ఆలస్యమైంది కానీ.. టీజర్ చూశాక చాలా సంతోషంగా ఉంది. చైతన్యం పరిచేలానూ, మాసీగా ఈ సినిమా ఉండబోతుందని అనిపించింది. వెంకీ అట్లూరి సోదరా.. టీజర్ అద్భుతంగా ఉంది.. నీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇప్పటికే టీజర్ బ్రహ్మాండంగా సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని హరీష్ శంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2022-08-05T05:16:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!