సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

HariHara Veeramallu teaser: మల్లయోధుల్ని మట్టికరిపించిన ‘వీరమల్లు’

ABN, First Publish Date - 2022-09-02T17:22:27+05:30

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ (HariHara Veeramallu)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ (HariHara Veeramallu) నుంచి పవర్ గ్లాన్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో వీరమల్లు తొడకొట్టి మల్లయోధుల్ని మట్టికరిపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. దీనికి ఎం ఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. 'దిగొచ్చింది భల్లు భల్లున...పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున.. మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు'.. అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో విడుదల చేసిన ఈ పవర్ గ్లాన్స్ టీజర్ అదిరిపోయింది. 


అయితే, ఇందులో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం కాస్త అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే గత కొన్ని నెలలనుంచి ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో రక రకాల రూమర్స్ వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. అసలు హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో..? అనే టాక్ కూడా ఈ మధ్య బలంగా వినిపిస్తోంది. ఇంకొందరైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాలలో బిజీ అవుతున్న నేపథ్యంలో ఇక మూవీ షూటింగ్ దశలో ఆగిపోతుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. 


వాటిన్నిటికీ సమాధానంగా తాజా టీజర్‌ను వదిలారు. ఈ టీజర్‌లోనే 2023, సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతునట్టుగా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. దాంతో ఇప్పటివరకు వచ్చినవన్నీ పూర్తిగా గాసిప్స్ అని తేలిపోయింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయనున్నారు. క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వం వహిస్తుండగా, అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం (A M Ratnam) మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది.  



Updated Date - 2022-09-02T17:22:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!