సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Harihara Veeramallu: అక్టోబర్‌లో పవన్‌ సర్‌ప్రైజ్‌!

ABN, First Publish Date - 2022-09-21T01:10:00+05:30

పవన్‌కల్యాణ్‌ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. రాజకీయ పర్యటనల కారణంగా అంగీకరించిన సినిమాలు ఆలస్యం అవుతున్నాయనే వార్తలు చాలారోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. రాజకీయ పర్యటనల కారణంగా అంగీకరించిన సినిమాలు ఆలస్యం అవుతున్నాయనే వార్తలు చాలారోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన దృష్టిలో సినిమాకు కేటాయించాల్సిన సమయం సినిమాలకే ఉందని, జనసేన (Janasena)పార్టీకి కేటాయించాల్సిన సమయం ఓ ప్రణాళిక ప్రకారం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా సెట్స్‌ మీదున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (harihara veeramallu). మొగల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి క్రిష్‌ (Krish)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజున విడుదల చేసిన టీజర్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టించిన సంగతి తెలిసిందే! అయితే ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ అక్టోబర్‌ ద్వితీయార్దంలో ప్రారంభం కానుందని తెలిసింది. అటు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ వచ్చే నెల ద్వితీయార్థం నుంచి పవన్‌ సినిమా సెట్‌లో అడుగుపెడతారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్‌ తాజా షెడ్యూల్‌ ప్లానింగ్‌లో ఉన్నారట. 




ఇందులో పవన్‌కల్యాణ్‌ మొగల్‌ సామ్రాజ్యం నుంచి కోహినూర్‌ వజ్రాలు దొంగిలించే పాత్రలో కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయన్ను ఇప్పటి వరకూ చూడని పాత్రలో, సరికొత్త లుక్‌లో చూడబోతున్నామని ఇప్పటికే క్రిష్‌ చెప్పారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం పలు ప్రాంతాల్లో భారీ సెట్లు నిర్మించారు.  తాజా షెడ్యూల్‌ ప్రారంభం రోజున సినిమా గురించి ఆసక్తికర విషయాలను విడుదల తేదీను వెల్లడిస్తారని తెలుస్తోంది. 


Updated Date - 2022-09-21T01:10:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!