సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వర్క్‌ షాప్‌లో ‘వీరమల్లు’

ABN, First Publish Date - 2022-10-01T05:30:44+05:30

ఏ సినిమాకైనా ప్రీ ప్రొడక్షన్‌ చాలా అవసరం. స్ర్కిప్టు పకడ్బందీగా రాసుకోవడమే కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ సినిమాకైనా ప్రీ ప్రొడక్షన్‌ చాలా అవసరం. స్ర్కిప్టు పకడ్బందీగా రాసుకోవడమే కాదు. రాసుకొన్న సన్నివేశాల్ని అనుకొన్నది అనుకొన్నట్టు తీర్చిదిద్దడానికి ఎలాంటి కసరత్తులు చేయాలో... అవన్నీ చేయాల్సిందే. భారీ చిత్రాల్ని రూపొందించేటప్పుడు అది మరింత అవసరం. ఎందుకంటే సెట్లో ప్రతి క్షణం విలువైనదే. ఓ రోజు షూటింగ్‌ ఆలస్యమైతే లక్షల్లో నష్టాలు భరించాల్సివస్తుంది. అందుకే ఆ తప్పు జరక్కుండా ఉండాలనే వర్క్‌ షాపులు నిర్వహిస్తుంటారు. ‘హరి హర వీరమల్లు’ టీమ్‌ కూడా అదే చేసింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. క్రిష్‌ దర్శకుడు. ఏ.ఎం.రత్నం నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన షెడ్యూల్‌ అక్టోబరు 2వ వారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఓ వర్క్‌ షాప్‌ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ వర్క్‌షా్‌పలో పవన్‌ కల్యాణ్‌తో పాటు క్రిష్‌, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత ఏ.ఎం.రత్నం, ఛాయాగ్రాహకుడు వి.ఎ్‌స.జ్ఞానశేఖర్‌, నటీనటులు నిధి అగర్వాల్‌, సుబ్బరాజు, రావు రమేశ్‌, హైపర్‌ ఆది, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించే కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన ప్రిపరేషన్‌ ఈ వర్క్‌ షాప్‌లో జరిగింది. 

Updated Date - 2022-10-01T05:30:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!