HariHaraVeeraMallu: పవన్ కల్యాణ్ న్యూ పిక్ వైరల్
ABN, First Publish Date - 2022-12-07T03:19:11+05:30
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). తొలిసారి పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). తొలిసారి పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం.. చారిత్రాత్మక నేపథ్యంతో.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పవర్ గ్లాన్స్ ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఈ సినిమా కోసం మెగాభిమానులే కాకుండా.. టాలీవుడ్ మొత్తం వేచి చూస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోధుడి తరహాలో.. రెడ్, బ్లాక్ కాంబినేషన్ డ్రస్‌లో పవన్ కల్యాణ్ ఇందులో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన లుక్, పోస్టర్స్ ఎలా అయితే వైరల్ అయ్యాయో.. ప్రస్తుతం లీకయిన పిక్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
రీసెంట్‌గానే బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసేందుకు.. పవన్ కల్యాణ్ అండ్ టీమ్ సిద్ధమయ్యారు. ఈ షూటింగ్ నిమిత్తం దర్శకుడు క్రిష్ వర్క్ షాప్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఒకవైపు పాలిటిక్స్‌కి టైమ్ కేటాయిస్తూనే.. మరో వైపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు రెండు మూడు సినిమాలు ఆల్రెడీ సైన్ చేసినవి ఉన్నాయి. రీసెంట్‌గానే సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాకి ఆయన సైన్ చేశారు. దీంతో.. ఆయన క్షణం కూడా తీరిక లేకుండా పని చేయాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఆల్రెడీ సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌ని శరవేగంగా కంప్లీట్ చేసి.. మిగతా సినిమాలను కూడా లైన్‌లోకి తీసుకురావాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. (Hari Hara Veera Mallu Leaked pic goes viral)