సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమ్మా జన్మదిన శుభాకాంక్షలు: శంకరబాబు

ABN, First Publish Date - 2022-01-29T15:00:04+05:30

నేడు (జనవరి 29) మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు (జనవరి 29) మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో చిరు.."అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు.. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో.. శంకరబాబు" అని పేర్కొన్నారు. చిరును తన తల్లి అంజనా దేవి 'శంకరబాబు' అని పిలుస్తుంటారు. అందుకే ట్వీట్‌లోనూ ఆయన అదే పేరును రాసుకొచ్చారు. కాగా, ఇటీవల కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే తిరిగి షూటింగులకు హాజరవుతారని సమాచారం.



Updated Date - 2022-01-29T15:00:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!