సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hanu Raghavapudi: నామీద ఉన్న అపనింద ఈ సినిమాతో పోతుంది..

ABN, First Publish Date - 2022-08-04T14:11:35+05:30

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ సీతారామం (Sita Ramam). ఈ మూవీ ఆగస్టు 5న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ముఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ సీతారామం (Sita Ramam). ఈ మూవీ ఆగస్టు 5న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ముఖ్య అతిథిగా సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. చిత్రంలో నటించిన ప్రముఖ తారాగణంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యమ్రమానికి హాజరయ్యారు.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.."నా సినిమాల్లో సెకండాఫ్ బాగుండదు.. అనే దానికి ఈ మూవీ సమాధానం ఇస్తుంది.  సీతారామం సినిమా సెకండాఫ్ విషయంలో నా పై ఉన్న అపనింద పోతుంది".. అని చాలా నమ్మకంగా చెప్పారు. మరి ఆయన ననమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో మూవీ విడుదలైతేగానీ తెలియదు. 


కాగా, మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ఇది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్ న్‌లో దర్శకుడు హనురాఘవపూడి (Hanu Raghavapudi) రూపొందించారు. ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా, మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించారు. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా విడుదల కాబోతోంది. 

Updated Date - 2022-08-04T14:11:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!