Hanu-Man: ఆకట్టుకుంటోన్న స్పెషల్ పోస్టర్

ABN , First Publish Date - 2022-08-23T23:46:51+05:30 IST

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరరకెక్కుతోన్న చిత్రం ‘హను-మాన్’ (Hanu-Man). మంగళవారం తేజ సజ్జా పుట్టినరోజు

Hanu-Man: ఆకట్టుకుంటోన్న స్పెషల్ పోస్టర్

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరరకెక్కుతోన్న చిత్రం ‘హను-మాన్’ (Hanu-Man). మంగళవారం తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది. పాన్ ఇండియా సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌‌టైన్‌‌మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్,  టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) కీలక పాత్ర పోషిస్తుండగా.. తేజ సజ్జా  సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్‌గా నటిస్తోంది.


స్పెషల్ పోస్టర్ విషయానికి వస్తే.. తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన స్పెషల్ పోస్టర్ కూడా.. ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కె నిరంజన్ రెడ్డి (K Niranjan Reddy) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్.. నలుగురు టాలెంటెడ్ సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. (Hanu-Man special poster)



Updated Date - 2022-08-23T23:46:51+05:30 IST