సింగిల్ షాట్ మూవీతో హన్సిక ప్రయోగం

ABN , First Publish Date - 2022-04-03T18:40:02+05:30 IST

అల్లు అర్జున్, పూరీ కాంబో మూవీ ‘దేశముదురు’తో టాలీవుడ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. తొలి చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వచ్చిన అవకాశాల్ని అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు లభించలేదు. దాంతో హన్సిక కోలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ నెం.1 హీరోయిన్ గా కొంత కాలం చక్రం తిప్పింది. ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అయిపోయింది. సినిమా పేరు ‘105 మినిట్స్’. పేరుకు తగ్గట్టుగానే సినిమా రన్ టైమ్ 105 నిమిషాలు ఉంటుంది.

సింగిల్ షాట్ మూవీతో హన్సిక ప్రయోగం

అల్లు అర్జున్, పూరీ కాంబో మూవీ ‘దేశముదురు’తో టాలీవుడ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. తొలి చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వచ్చిన అవకాశాల్ని అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు లభించలేదు. దాంతో హన్సిక కోలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ నెం.1 హీరోయిన్ గా కొంత కాలం చక్రం తిప్పింది. ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అయిపోయింది. సినిమా పేరు ‘105 మినిట్స్’.  పేరుకు తగ్గట్టుగానే సినిమా రన్ టైమ్ 105 నిమిషాలు ఉంటుంది. అయితే సినిమా మొత్తాన్ని  సింగిల్ షాట్ లోనే చిత్రీకరించడం దాని ప్రత్యేకత. అంతేకాదండోయ్.. ఇందులోని పాత్ర కూడా సింగిలే.   సాధారణంగా ఇలాంటి సినిమాలు థ్రిల్లర్స్ అయి ఉంటాయి. 


ఇండియాలోనే మొట్ట మొదటిసారిగా సింగిల్ షాట్, సింగిల్ కేరక్టర్ తో ఈ ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఉత్కంఠ భరితంగా సాగే కథాకథనాలతో ఈ సినిమాను రాజు దుస్సా తెరకెక్కిస్తున్నాడు. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. హాలీవుడ్ సినిమా తరహాలో రూపొందిన ఈ సింగిల్ షాట్ , సింగిల్ కేరక్టర్ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-04-03T18:40:02+05:30 IST

Read more