Hamsa nandini: ఇది నాకు పునర్జన్మ!
ABN , First Publish Date - 2022-12-08T18:58:02+05:30 IST
ఏడాదిన్నరగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు కథానాయిక హంసా నందిని. సర్జరీ 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత ఆమె కోలుకుని ఆరోగ్యవంతంగా ఉన్నారు. జన్యుపరంగా వచ్చిన ఈ వ్యాధిని జయిస్తానని ఆమె మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు.
ఏడాదిన్నరగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు కథానాయిక హంసా నందిని(Hamsa nandini). సర్జరీ 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత ఆమె కోలుకుని ఆరోగ్యవంతంగా ఉన్నారు. జన్యుపరంగా వచ్చిన ఈ వ్యాధిని జయిస్తానని ఆమె మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. తన తల్లి కూడా ఇదే జబ్బుతో చనిపోయినట్లు చెప్పారు. మళ్లీ మామూలు మనిషి అవుతాననే తన నమ్మకం, చికిత్స ఫలించాయి. హంసా ఇప్పుడు క్యాన్సర్‌ను (Hamsi nandini cancer survivor) జయించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చారు. అంతే కాదు ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె సినిమాలపై దృష్టి పెట్టారు. బుధవారం ఆమె సెట్‌లో అడుగుపెట్టారు. షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘నేను మళ్లీ సెట్‌లో అడుగుపెట్టా. నాకు భగవంతుడు పునర్జన్మ ఇచ్చాడు అన్న భావన కలుగుతోంది. ఈ రాత్రికి సెట్‌లో నా కోస్టార్స్, క్రూతో కెమెరా ముందు పుట్టినరోజు వేడుక సెలబ్రేట్ చేసుకోబోతున్నా. ఇలాంటి సందర్భాన్ని ఎలా మిస్ అవుతాను? ఆడియన్స్ ప్రేమ, ఆప్యాయతల వల్లే నేను కోలుకుని రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఐ యామ్ బ్యాక్’’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (Hamsa nanidi is Back)
‘అనుమానస్పదం’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హంసా నందిని కథానాయికగా పలు చిత్రాల్లో నటించారు. అత్తారింటికి దారేది, లౌక్యం, రామయ్య వస్తావయ్యా, లెజెండ్ వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో మెప్పించారు.