సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

టాప్‌గేర్‌ వేయాల్సి వచ్చింది

ABN, First Publish Date - 2022-12-28T02:47:39+05:30

‘‘టాప్‌గేర్‌’ సినిమాలో ఆద్యంతం హీరోపాత్ర ఓ ఎమోషన్‌తో సాగుతుంది. కథానుసారం హీరో టాప్‌గేర్‌ వేయాల్సి వస్తుంది. స్టైలీష్‌గా ఉందని ఆ టైటిల్‌ను నిర్ణయించాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘టాప్‌గేర్‌’ సినిమాలో ఆద్యంతం హీరోపాత్ర ఓ ఎమోషన్‌తో సాగుతుంది. కథానుసారం హీరో టాప్‌గేర్‌ వేయాల్సి వస్తుంది. స్టైలీష్‌గా ఉందని ఆ టైటిల్‌ను నిర్ణయించాం. సినిమా టెక్నికల్‌గా చాలా బాగుంటుంది. మ్యూజిక్‌, కెమెరా వర్క్‌ అద్భుతంగా ఉంటాయి’ అని ఆదిసాయికుమార్‌ అన్నారు. కె. శశికాంత్‌ దర్శకత్వంలో కె.వి శ్రీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 30న విడుదలవుతోన్న సందర్భంగా ఆది సాయికుమార్‌ మీడియాతో ముచ్చటించారు.

‘టాప్‌గేర్‌’ కథ నాకు బాగా నచ్చింది. లైన్‌ చాలా కొత్తగా ఉంది. 24 గంటల్లో జరిగే సంఘటనలతో రూపొందింది. ఇందులో క్యాబ్‌ డ్రైవర్‌ పాత్ర పోషించాను. అతనికి ఎదురైన చిన్న సమస్య కాస్తా సాలెగూడులా మారుతుంది. అందులోంచి బయటపడటానికి హీరో చేసిన సాహసాల నేపథ్యంలో కథ సాగుతుంది. సినిమాలో ఎక్కువ భాగం కారులోనే సాగుతుంది.

శశికాంత్‌కు తనకు ఏం కావాలో చాలా స్పష్టత ఉంది. ప్రతి సన్నివేశాన్ని తనకు కావాల్సిన విధంగా నటీనటులు, డీవోపీకి వివరించి అనుకున్న అవుట్‌పుట్‌ రాబట్టుకుంటారు.

ఫైట్‌ మాస్టర్‌ పృథ్వీ పోరాట ఘట్టాలను సహజంగా కంపోజ్‌ చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ అంతా రాత్రిళ్లే చిత్రీకరించాం. ‘టాప్‌గేర్‌’ సినిమాకు ఆర్‌ఆర్‌ చాలా ముఖ్యం. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అద్భుతమైన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు.

‘టాప్‌గేర్‌’ను హిందీలో డబ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ చిత్రం చేస్తున్నాను. వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ పూర్తయింది.

Updated Date - 2022-12-28T02:47:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!