Gurthunda Seethakalam: మ్యాజిక్ చేసేందుకు సిద్ధం.. శీతాకాలంలోనే..

ABN , First Publish Date - 2022-11-27T16:59:24+05:30 IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’..

Gurthunda Seethakalam: మ్యాజిక్ చేసేందుకు సిద్ధం.. శీతాకాలంలోనే..

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న  చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam). టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్ (Satya Dev), మిల్కి బ్యూటీ త‌మ‌న్నా(Tamannaah), మేఘా ఆకాష్, కావ్యశెట్టి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చాలామంది త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత, వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. 


ఇలాంటి  సంఘ‌ట‌నలు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశ్యంతో ఈ  'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని రూపొందించారు. క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్నిదర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేశాయి. దాదాపుగా అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఇప్పటి వరకు విడుదలకాకుండా వాయిదా పడుతూ వచ్చింది.


‘శీతాకాలం అంటే.. మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, నా లైఫ్ లో  శీతాకాలానికి ఇంకో పేరు ఉంది సీజన్ అఫ్ మ్యాజిక్’ అని ఈ సినిమా ట్రైలర్‌లో చెప్పినట్లు ఈ శీతాకాల సీజన్‌లోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సీజన్‌కి జస్టిఫికేషన్‌గా శీతాకాలంలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబులు సంయుక్తంగా నిర్మించారు.





Updated Date - 2022-11-27T16:59:24+05:30 IST