గుప్పెండంత గుండెల్లోన ఉంటావే

ABN , First Publish Date - 2022-05-12T09:41:10+05:30 IST

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటించిన ‘లెహరాయి’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది...

గుప్పెండంత గుండెల్లోన ఉంటావే

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటించిన ‘లెహరాయి’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి రాసిన ‘గుప్పెడంత గుండెల్లోన ఉంటావే’ అనే పాటను  హీరో కార్తికేయ విడుదల చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘సినిమాలోని తొలి పాటను విడుదల  చేశాం. గతంలో తను స్వరపరిచిన పాటలకు ఏ మాత్రం తగ్గకుండా జీకే ఈ పాటను కంపోజ్‌ చేశారు. యువతను అలరించే పాట ఇది’ అని చెప్పారు. దర్శకుడు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ ‘సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. ప్రతి పాటా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మంచి ఫీల్‌ ఉన్న కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి బెక్కం వేణుగోపాల్‌ సమర్పకుడు.

Updated Date - 2022-05-12T09:41:10+05:30 IST

Read more