Sitaramam : మేజర్ సెల్వన్‌గా గౌతమ్ మీనన్

ABN , First Publish Date - 2022-07-15T22:05:43+05:30 IST

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘సీతారామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్‌ లైన్‌తో ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం రూపొందుతోంది.

Sitaramam : మేజర్ సెల్వన్‌గా గౌతమ్ మీనన్

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman), మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) జోడీగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘సీతారామం’ (Sitaramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్‌ లైన్‌తో ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం రూపొందుతోంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ గా దుల్ఖర్, సీతగా మృణాళ్ ఠాకూర్ నటిస్తుండగా.. మరో కీలక పాత్రను అందాల రష్మికా మందణ్ణ చేస్తోంది. ఇంకా ఇందులో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ (Sumanth) నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రను దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) చేస్తున్నారు. 


యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక సైనికుడు.. ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడితే.. పర్యవసానం ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ ప్రేమకథ పుట్టినట్టు దర్శకుడు చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ను హిమాలయాల్లోని మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ లో జరిపినట్టు మేకర్స్ తెలిపారు. అలాగే... ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్‌లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని షూట్ చేశారు. తాజాగా ఈ సినిమాలో మేజర్ సెల్వన్ గా నటిస్తున్న గౌతమ్ మీనన్ (Gowtham Menon) లుక్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 


ఇదివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, నటీనటుల పరిచయ వీడియోలకు అద్భుతమైన స్పందన వచ్చింది.  థియేట్రికల్ ట్రైలర్ పై భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘మహానటి’ (Mahanati) చిత్రంతో తెలుగువారికి బాగా దగ్గరైన దుల్ఖర్ సల్మాన్ డైరెక్ట్ గా నటిస్తున్న రెండో చిత్రం కావడంతో ‘సీతారామం’ పై మరింతగా హైపు క్రియేట్ అయింది. మరి ఈ సైనికుడి ప్రేమకథ ఏ స్థాయిలో ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-15T22:05:43+05:30 IST