Gouthami: రీ ఎంట్రీ
ABN, First Publish Date - 2022-11-12T17:45:17+05:30
తమిళ, తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లో నటించిన సీనియర్ నటి గౌతమి చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. ఓ హిందీ వెబ్ సిరీస్ నటిస్తున్నారు.
తమిళ, తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లో నటించిన సీనియర్ నటి గౌతమి (Gouthami)చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. ఓ హిందీ వెబ్ సిరీస్ నటిస్తున్నారు. కోలీవుడ్‌కు 1980లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘గురు శిష్యన్’ చిత్రం ద్వారా పరిచయమై దశాబ్దకాలం పాటు అగ్రనటిగా కొనసాగింది. ‘కావల్‌కారన్’, ‘నమ్మ వూరు నాయకన్’, ‘అపూర్వ సహోదర్‌గల్’, ‘దేవర్ మగన్’, ‘నమ్మవర్’, ‘కురుదిప్పునల్’ వంటి హిట్ చిత్రాల్లో నటించి 2006లో వచ్చిన ‘శాసనం’ చిత్రం తర్వాత కొన్నేళ్ళపాటు వెండితెరకు దూరంగా ఉంది. 2015లో కమల్ హాసన్ నటించిన ‘పాపనాశం’ చిత్రం ద్వారా (Re entry) రీఎంట్రీ ఇచ్చి కమల్‌తో సహజీవనం చేసి తరువాత ఆయనతో తెగదెంపులు చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ కెమెరా ముందుకు వస్తోంది. అయితే ఈ సిరీస్ వివరాలు తెలియాల్సి ఉంది.