హైదరాబాద్‌లో ఉంటున్న Mahesh Babu ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... TS govt కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-05-12T01:16:48+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలో సర్కారు వారి పాట (sarkaru vaari paata) సినిమాని ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించేందుకు

హైదరాబాద్‌లో ఉంటున్న Mahesh Babu ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... TS govt కీలక నిర్ణయం

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలో సర్కారు వారి పాట (sarkaru vaari paata) సినిమాని ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని భ్రమరాంబ థియేటర్, మల్లికార్జున థియేటర్, విశ్వనాథ్ థియేటర్‌తోపాటు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌లలో మాత్రమే ఈ ప్రత్యేక షోలను ప్రదర్శించనున్నారు. సర్కారువారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు సర్కారువారి పాట సినిమాను 12-5-2022న ఒక ప్రత్యేక షో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ప్రత్యేక షోకు అనుమతి ఇచ్చామని వివరించారు. కాగా ఈ ప్రత్యేక షోలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక షోలకు అనుగుణంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా 12-5-2022 నుంచి 18-05-2022 మధ్య వారం రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్య 5 షోలు ప్రదర్శించేందుకు ఇప్పటికే సర్కార్ వారి పాటకు అనుమతి దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక షోతో హైదరాబాద్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 6 షోలు పడనున్నాయి.


కాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక  ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి.Updated Date - 2022-05-12T01:16:48+05:30 IST

Read more