Satyadev: ‘గాడ్సే’ విడుదల ఖరారు!

ABN , First Publish Date - 2022-06-04T23:22:08+05:30 IST

‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత దర్శకుడు గోపీ గణేశ్‌– సత్యదేవ్‌(Satyadev) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే(Godse)’. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. సి.కల్యాణ్‌ నిర్మాత. చిత్రీకరణ చివరి దశలో ఉంది. జూన్‌ 17న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Satyadev: ‘గాడ్సే’ విడుదల ఖరారు!

‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత దర్శకుడు గోపీ గణేశ్‌– సత్యదేవ్‌(Satyadev) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే(Godse)’. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. సి.కల్యాణ్‌ నిర్మాత. చిత్రీకరణ చివరి దశలో ఉంది. జూన్‌ 17న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘‘ఇందులో సత్యదేవ్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అక్కడి పరిస్థితుల దృష్ట్యా రౌండప్‌ చేస్తూ మూడు నిమిషాల 20 సెకన్ల డైలాగ్‌ సింగిల్‌ డైలాగ్‌ రొమాలు నిక్కబొడిచేలా ఉంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. 


Updated Date - 2022-06-04T23:22:08+05:30 IST