Godfather OTT Release: ఓటీటీ విడుదలకి సిద్ధమైన మెగాస్టార్ సినిమా!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

ABN , First Publish Date - 2022-11-02T18:51:52+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గాఢ్ ఫాదర్’ (Godfather)...

Godfather OTT Release: ఓటీటీ విడుదలకి సిద్ధమైన మెగాస్టార్ సినిమా!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గాఢ్ ఫాదర్’ (Godfather). మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ (Lucifer)కి ఇది రిమేక్. తమిళ డైరెక్టర్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 5న తెలుగులో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. కాగా.. థియేటర్స్‌లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ విడుదల (OTT Release)కి సిద్ధమవుతోంది.


ఇప్పటి వరకు అంతర్జాతీయ కంటెంట్ మీద ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేసిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం లోకల్ కంటెంట్‌ మీద దృష్టి సారించింది. అందులో భాగంగా ‘గాడ్‌ ఫాదర్‌’ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకులకి అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోందట. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 19న అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సూపర్ హిట్ మూవీలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.



Updated Date - 2022-11-02T18:51:52+05:30 IST