GodFather : బ్లాస్టింగ్ అప్డేట్..
ABN, First Publish Date - 2022-05-03T15:44:15+05:30
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ చిత్రానికి తెలుగులో అఫీషియల్ రీమేక్‌గా తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా
GodFather : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ చిత్రానికి తెలుగులో అఫీషియల్ రీమేక్‌గా తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, నేడు రంజాన్ పండుగ సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ చిత్రబృందం ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. చిత్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈ మూవీలో మెగాస్టార్ - భాయ్ సల్మాన్ కలిసి ఓ సాంగ్‌లో స్టెప్పులేనున్నారని..దానికోసం సూపర్ సాంగ్‌ను కంపోజ్ చేసినట్టు ఇంతకముందే తెలిపాడు.
దీనికి సంబందించిన తాజా అప్డేట్ వచ్చింది. ఈ సాంగ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందివ్వబోతున్నారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా ఆయనకున్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ నటించిన ‘రాజా విక్రమార్క’, ‘ఘరానామొగుడు’, ‘శంకర్ దాదా సిరీస్’, లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో సూపర్ హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ అందించారు. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు డాన్స్ మూవ్మెంట్స్ కంపోజ్ చేయడంలో ప్రభుదేవా మాస్టర్ స్టైలే వేరు. ఇప్పటి వరకు చిరు - ప్రభుదేవా మాస్టర్ కాంబోలో వచ్చిన సాంగ్స్ కంటే ‘గాడ్ ఫాదర్’ మూవీలో సాంగ్ మరో రేంజ్లో ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. చూడాలి మరి థమన్స్ బీట్స్‌కు ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రఫీకి మెగాస్టార్ - సల్మాన్ ఏ రేంజ్లో సిల్వర్ స్క్రీన్ మీద అదరగొడతారో.