God Father: ఫస్ట్ సింగిల్‌పై థమన్ పోస్ట్..

ABN , First Publish Date - 2022-08-23T14:32:00+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ (SS Thaman).

God Father: ఫస్ట్ సింగిల్‌పై థమన్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ (SS Thaman). ఈ సినిమాలో నయనతార (Nayanathara), సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath) అతిథి పాత్రలలో కనిపించనున్నారు. మోహన్‌ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసందే. 


అయితే, తాజాగా చిత్ర సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రాబోతుందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. దీనిలో ఆయన ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్‌తో కలిసి ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీలో ఓ అద్భుతమైన పాటను శ్రేయా ఘోషాల్‌తో పాడించినట్టు కన్‌ఫర్మ్ అయింది. ఇప్పటికే, ఆమె తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు‌. ఇక ఇప్పుడు ఈ ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో పాడిన పాట ఎలా ఉండబోతుందో చూడాలి.


కాగా, భారీ స్థాయిలో అక్టోబరు 5న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆచార్య సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. తాజా టీజర్‌తో భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమాపై ఇప్పుడు వరుస అప్‌డేట్‌తో ఆ అంచనాలను రెట్టింపు చేయబోతున్నారు. చూడాలి మరి ఆ అంచనాలను ‘గాడ్‌ ఫాదర్‌’ ఎంతవరకు అందుకుంటుందో. 



Updated Date - 2022-08-23T14:32:00+05:30 IST

Read more