సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

God Father Pre Release Event: ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..

ABN, First Publish Date - 2022-09-25T18:07:49+05:30

మెగాస్టార్‌ చిరంజీవి ఈనెల 28న అనంతపురం నగరానికి వెళుతున్నారు. తాను నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఈవెంట్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

28న అనంతకు అన్నయ్య

ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో గాడ్‌ ఫాదర్‌ ఈవెంట్‌


అనంతపురం: మెగాస్టార్‌ చిరంజీవి ఈనెల 28న అనంతపురం నగరానికి వెళుతున్నారు. తాను నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఈవెంట్‌ను రెండు రోజుల పాటు అనంతపురం నగరంలో నిర్వహించనున్నారు. నగరంలోని ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ ఈ వేడుకకు వేదికగా శనివారం నిర్ధారణ అయింది. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ అనంతలో జరగనుండటంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాడ్‌ ఫాదర్‌ ఈవెంట్‌ అనంతపురం జిల్లాలో ఉంటుందని వారం రోజులుగా జిల్లాలో చర్చ నడుస్తోంది. అధికారికంగా నిర్ధారణ కావడంతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.


ఈ నెల 27, 28 తేదీల్లో గాడ్‌ ఫాదర్‌ ఈవెంట్‌ నిర్వహిస్తారు. క్లాక్‌ టవర్‌ వద్ద ఉన్న ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌ను వినియోగించుకునేందుకు కళాశాల ప్రిన్సిపాల్‌ నుంచి అనుమతి పొందారు. 27వ తేదీ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఏర్పాటు చేస్తారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు అనంతకు వస్తారు.

Updated Date - 2022-09-25T18:07:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!