సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

God father: చిరు, సల్మాన్‌లపై షూట్..ఎక్కడంటే..!

ABN, First Publish Date - 2022-03-12T13:57:43+05:30

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో 'గాడ్ ఫాదర్' ఒకటి. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్‌'కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో 'గాడ్ ఫాదర్' ఒకటి. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్‌'కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. అయితే, ఈ ఆదివారం నుంచి సల్మాన్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్టు తాజా సమాచారం. చిరు-సల్మాన్ కాంబినేషన్‌లోని కీలక సన్నివేశాలను ముంబై సమీపంలోని ఎన్డీ స్టూడియోస్‌లో చిత్రీకరించబోతున్నారట. వారం రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణతో ఈ షెడ్యూల్ పూర్తవుతుందట. ఇక ముంబైలో షూట్ జరిగే ఈ వారం రోజులు కూడా సల్మాన్ ఫామ్ హౌస్‌లోనే చిరంజీవి ఉండబోతున్నారని తెలుస్తోంది. నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎన్ వి ప్రసాద్, రామ్ చరణ్, ఆర్ బి చౌదరి కలిసి నిర్మిస్తున్న మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2022-03-12T13:57:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!