గీత సాక్షిగా... ఏం జరిగింది?

ABN , First Publish Date - 2022-09-24T06:05:16+05:30 IST

ఆదర్శ్‌, చిత్ర శుక్లా, రూపేష్‌ శెట్టి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు...

గీత సాక్షిగా... ఏం జరిగింది?

ఆదర్శ్‌, చిత్ర శుక్లా, రూపేష్‌ శెట్టి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్‌ రాజ్‌ నిర్మాత. ఆయనే కథ అందించారు. ఇటీవల కొత్త టీజర్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో కోర్ట్‌ రూమ్‌ డ్రామా. ప్రతీ సన్నివేశం ఆకట్టుకుంటుంది. టీజర్‌లోని డైలాగులకు మంచి స్పందన వచ్చింది. ఆదర్శ్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర.. ఇలా సీనియర్‌ నటీనటులంతా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్‌ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణ’’ అన్నారు.

Updated Date - 2022-09-24T06:05:16+05:30 IST

Read more