సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nara rohith- Sri vishnu: దోస్త్‌ అంటే నువ్వేరా సాంగ్‌!

ABN, First Publish Date - 2022-08-09T01:13:17+05:30

ఉదయ్‌ శంకర్‌, జెన్నీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గర్ల్‌ ఫ్రెండూ’. కమర్షియల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అట్లూరి సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ‘దోస్త్‌ అంటే నువ్వేరా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయ్‌ శంకర్‌(Udaya shankar), జెన్నీ (Jenny)జంటగా నటిస్తున్న చిత్రం ‘గర్ల్‌ ఫ్రెండూ’. (Girl friend)కమర్షియల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అట్లూరి సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ‘దోస్త్‌ అంటే నువ్వేరా.. ఫ్రెండ్‌ అంటే నువ్వేరా..’ అనే లిరికల్‌ సాంగ్‌ను నిజజీవితంలో మంచి మిత్రులైన నారా రోహిత్‌, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. మున్నా ఎస్డీ సాహిత్యం అందించగా రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. గిప్టన్‌ ఎలియాస్‌ స్వరకర్త.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్థమవుతోంది. ‘‘ఫ్రెండ్‌ షిష్‌డే సందర్భంగా ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని నారా రోహిత్‌ అన్నారు. 


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘‘రోహిత్‌తో కలసి  ఫ్రెండ్‌ షిప్‌డే సాంగ్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ టీమంతా నాకు చాలా కాలంగా తీశారు. ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ కథ, కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శకుడు గురు పవన్‌ ప్రతిభ గల వ్యక్తి. ఈ చిత్రం అన్ని వర్గాలను మెప్పించేలా ఉంటుందని నమ్ముతున్నా’’ అని అన్నారు. 

Updated Date - 2022-08-09T01:13:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!