The Ghost : ఊటీలో తదుపరి షెడ్యూల్

ABN , First Publish Date - 2022-04-03T15:57:53+05:30 IST

ఈ ఏడాది ఆరంభంలో ‘బంగార్రాజు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున .. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగ్ సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ కీలక సన్నివేశాల్ని, యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించాడు దర్శకుడు. ఈ క్రమంలో నిన్న (శనివారం) ఉగాది శుభాకాంక్షలు తెలుపిన మేకర్స్.. తదుపరి షెడ్యూల్‌ను ఊటీలో ప్లా్న్ చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదిక గా తెలియచేశారు.

The Ghost : ఊటీలో తదుపరి షెడ్యూల్

ఈ ఏడాది ఆరంభంలో ‘బంగార్రాజు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున .. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగ్ సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ కీలక సన్నివేశాల్ని, యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించాడు దర్శకుడు. ఈ క్రమంలో నిన్న (శనివారం) ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ..  తదుపరి షెడ్యూల్‌ను ఊటీలో ప్లాన్ చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదిక గా తెలియచేశారు మేకర్స్.


‘గరుడవేగ’ తరహాలోని స్పై థ్రిల్లర్ గా ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాదే చిత్రం విడుదల కానుంది. ఇంతకు ముందు ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ మూవీలో నటించిన నాగ్.. ప్రస్తుతం  అదే తరహా కథాంశంతో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలోని నాగార్జున గెటప్, మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకోబోతోంది. వెంటనే విడుదల తేదీనీ లాక్ చేయబోతున్నారు. మరి ‘ది ఘోస్ట్’ గా నాగార్జున ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. 



Updated Date - 2022-04-03T15:57:53+05:30 IST