‘ఘోస్ట్’ వస్తున్నాడు
ABN , First Publish Date - 2022-11-26T06:58:30+05:30 IST
ఇటీవల నాగార్జున ‘ఘోస్ట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇదే పేరుతో మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది.

ఇటీవల నాగార్జున ‘ఘోస్ట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇదే పేరుతో మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. శ్రీని దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సందేశ్ నాగరాజ్ నిర్మాత. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. 28 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో జైలు నేపథ్యంలో సాగే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఇందుకోసం రూ.6 కోట్ల వ్యయంతో ఓ ప్రత్యేకమైన జైల్ సెట్ తీర్చిదిద్దారు. వచ్చే నెలలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Read more