సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

FNCC: ఎన్నికలు పూర్తి.. అధ్యక్షుడు ఎవరంటే..

ABN, First Publish Date - 2022-09-26T04:56:51+05:30

ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఘట్టమనేని ఆదిశేషగీరిరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ చౌదరి గెలుపొందిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో (FNCC)జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఘట్టమనేని ఆదిశేషగీరిరావు (Ghattamaneni AAdi seshagiri Rao) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ చౌదరి గెలుపొందిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై (Bandla ganesh )తుమ్మల రంగారావు విజయం సాధించారు. రెండేళ్లకోసారి ఎఫ్‌ఎన్‌సీసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4600 సభ్యులున్నఈ కల్చరల్‌ సెంటర్‌లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు,  దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, కేఎల్‌ నారాయణ ప్యానల్‌ సభ్యులే గెలుపొందారు. ముళ్ళపూడి మోహన్‌ సెక్రటరీగా, తుమ్మల రంగారావు వైస్‌ ప్రెసిడెంట్‌గా, రాజశేఖర్‌ రెడ్డి ట్రెజరర్‌గా, వీవీఎస్‌ఎస్‌ పెద్దిరాజు జాయింట్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇదే కమిటీలో మెంబర్స్‌గా ఏడిద రాజా, ఇంద్రపాల్‌ రెడ్డి, వడ్లపట్ల మోహన్‌, సి.హెచ్‌ వరప్రసాదరావు, శైలజ, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహనరావు, బాలరాజు, గోపాలరావు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 




Updated Date - 2022-09-26T04:56:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!