సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ధ్వని’ మోషన్ పోస్టర్‌పై బుల్లితెర కమల్ హాసన్ ప్రశంసలు

ABN, First Publish Date - 2022-04-16T23:50:17+05:30

వినయ పాణిగ్రాహి, స్వాతి మండాది ప్రధాన పాత్రధారులుగా నాగ దుర్గారావు సానా దర్శకత్వంలో పరమకృష్ణ మరియు సాధన నన్నపనేని నిర్మించిన చిత్రం ‘ధ్వని’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినయ పాణిగ్రాహి, స్వాతి మండాది ప్రధాన పాత్రధారులుగా నాగ దుర్గారావు సానా దర్శకత్వంలో పరమకృష్ణ మరియు సాధన నన్నపనేని నిర్మించిన చిత్రం ‘ధ్వని’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఇటీవల హీరో నవదీప్‍ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నటుడు, బుల్లితెర కమల్ హాసన్‌గా పేరొందిన గెటప్ శ్రీను విడుదల చేశారు.


ఈ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ‘ధ్వని మోషన్ పోస్టర్ చాలా బాగుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. మంచి ప్రయత్నంతో చేసిన ధ్వని సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని తెలుపగా.. దర్శకుడు నాగ దుర్గారావు సానా మాట్లాడుతూ.. శబ్ధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడే వ్యక్తి  జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్‍గా రూపొందింది. ఇందులో కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది అని అన్నారు. 

Updated Date - 2022-04-16T23:50:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!