Bigg Boss 6: గీతూ క్రష్.. ఎవరో తెలుసా?
ABN , First Publish Date - 2022-09-25T05:52:23+05:30 IST
బిగ్‌బాస్ హౌస్‌లో చలాకీగా ఆడుతున్న కంటెస్టెంట్ గలాటా గీతూ. ఎవరినీ లెక్క చేయకుండా మొదటి రోజు నుంచి ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ఆటను దీటుగా ఆడుతోంది.

బిగ్‌బాస్ (Biggboss6)హౌస్‌లో చలాకీగా ఆడుతున్న కంటెస్టెంట్ గలాటా గీతూ(Galata Geethu). ఎవరినీ లెక్క చేయకుండా మొదటి రోజు నుంచి ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ఆటను దీటుగా ఆడుతోంది. దాంతో గతవారం గీతూ బాగా ఆడుతోందని నాగార్జున (Nagarjuna) చప్పట్లు కొట్టించారు. దీంతో గీతూ రాయల్ ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. తనకు తిరుగే లేదనుకుంటూ ఇంట్లో ప్రవర్తిస్తుంది. సాటి అమ్మాయి అనే సంస్కారం లేకుండా ఇనాయాను కామెంట్ చేసింది. పిట్ట పిట్ట అంటూ కామెంట్ చేసి చిల్లర చేష్టలు చేసింది. ఇనయ వాడు అన్నందుకు సీరియస్ అయ్యాడు శ్రీహాన్. ఇనయాను మాత్రం పిట్ట అంటూ పిచ్చిగా మాట్లాడాడు. ఇనయా తిరగబడగా ‘అమ్మో చెవిలో రక్తం వచ్చేలా ఉంది అంటూ తప్పించుకుని తిరిగాడు. ఇక రేవంత్‌ని వాడు అన్నందుకు సంస్కారం నేర్పలేదా ఇంట్లో అంటూ ఇనయాపై నోరు జారాడు. కొట్టేస్తానని దూసుకెళ్లాడు. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఈ ముగ్గురికీ ఓ రేంజ్‌లో క్లాస్ ఇచ్చారు.
రెండో వారంమంచి పేరు తెచ్చుకున్న గీతు.. మూడోవారం టాస్క్‌లో కూడా బాగా ఆడి మరింత పేరుతెచ్చుకోవాలని చాలారకాల స్ట్రాటజీలు వాడింది. దానికి తగ్గట్లే ఆడింది. అయితే అసలు విషయంలోకి వెళ్తే.. గీతూ కూడా ఇంట్లో ఓ ట్రాక్ నడుపుతోంది. శుక్రవారం ఎపిసోడ్‌లో టాస్క్ అయిన తర్వాత గీతూ, రాజశేఖర్, ఫైమా ముచ్చట్లు పెడతారు. పక్కనే నేహా కూడా ఉంటుంది ఆ ముచ్చటలో రాజశేఖర్ క్రష్ ఎవరిపైనా అనే టాపిక్ వస్తుంది. దానికి సమాధానంగా శేఖర్ క్రష్ నేనే అంటోంది. రాజశేఖర్‌ని బ్రదర్ అంటావ్‌గా అని తోటి సభ్యులు అనగా... అవునబ్బా నాకు రాజశేఖర్ తమ్ముడే.. నేను అక్కనే కానీ అక్కతోనే క్రష్ నడుస్తోందంటూ గీతూ సిగ్గుపడుతూ చెబుతుంది. ఏ అక్కతో క్రష్‌లో ఉండకూడదా? లవర్‌తో మాత్రమే ఉండాలా అని అంటుంది గీతూ. దీనితో రాజశేఖర్‌కి ఏ మాట్లాడాలో తెలియక సిగ్గుపడతాడు., పక్కనే ఉన్న ఫైమా క్రష్ తర్వాత. ముందు మీరు వెళ్లి బ్రష్ చేసి రండీ అంటూ ప్రాసతో పంచ్ వేస్తుంది.