Pushpa the rise : వైరల్ అవుతోన్న గణేశ్ ఆచార్య వీడియో

ABN , First Publish Date - 2022-01-18T19:48:26+05:30 IST

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఘన విజయం వెనుక సమంతా డ్యాన్స్ నెంబర్ కూడా ఓ కారణమని చెప్పుకోవాలి. ఈ ఆఫర్ ను ముందుగా తిరస్కరించిన సామ్.. బన్నీ కన్విన్స్ చేయడంతో ఆ పాటలో నర్తించడానికి ఒప్పుకుంది. పూర్తి ఇన్వాల్వ్ మెంట్ తో ఆ పాటను ఓన్ చేసుకొన్న తీరు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ తో .. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా అంటూ ఫ్లోర్ పై నర్తిస్తూ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో చెలరేగిపోయింది. అయితే ఈ పాట థియేటర్స్ లో అంతగా పేలడానికి గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీ కూడా మరో కారణమైంది.

Pushpa the rise : వైరల్ అవుతోన్న గణేశ్ ఆచార్య వీడియో

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఘన విజయం వెనుక సమంతా డ్యాన్స్ నెంబర్ కూడా ఓ కారణమని చెప్పుకోవాలి. ఈ ఆఫర్ ను ముందుగా తిరస్కరించిన సామ్.. బన్నీ కన్విన్స్ చేయడంతో ఆ పాటలో నర్తించడానికి ఒప్పుకుంది. పూర్తి ఇన్వాల్వ్ మెంట్ తో ఆ పాటను ఓన్ చేసుకొన్న తీరు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ తో .. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా అంటూ ఫ్లోర్ పై నర్తిస్తూ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో చెలరేగిపోయింది. అయితే ఈ పాట థియేటర్స్ లో అంతగా పేలడానికి గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీ కూడా మరో కారణమైంది. చాలా క్లాసీగా క్రేజీగా ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు గణేశ్ మాస్టర్. 


తాజాగా గణేశ్ మాస్టర్ ఇన్ స్టాలో ఈ పాట గురించి తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అనదర్ హిట్ విత్ మై ఫేవరేట్... అల్లు అర్జున్, సమంతా తో సెట్స్ లో చాలా సరదాగా టైమ్ స్పెండ్ చేశాను’ అంటూ గణేశ్ మాస్టర్ తెలిపారు. గణేశ్ మాస్టర్ తన అసిస్టెంట్ సహాయంతో పాటను కంపోజ్ చేసి బన్నీ, సామ్ లకు చూపించగా.. సామ్ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. 



Updated Date - 2022-01-18T19:48:26+05:30 IST