గల్లా అశోక్‌కు ఎలాంటి సంబంధం లేదు : గల్లా ఫ్యామిలీ

ABN , First Publish Date - 2022-04-03T19:29:27+05:30 IST

హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బైటపడింది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులున్నట్టు తెలుస్తోంది. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడిచేయగా.. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్న వారు మాత్రమే ఉన్నారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపారు. అయితే దాడిలో అదుపులోకి తీసుకున్న వారి లిస్ట్ లో గల్లా అశోక్ పేరు కూడా ఉందని మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఆ వార్తల్ని గల్లా కుటుంబం ఖండించింది.

‘నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో  గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’.. అంటూ గల్లా ఫ్యామిలీ వివరణ ఇచ్చింది. ఇంకా పట్టుబడిన వారిలో మెగా డాటర్ కొణిదెల నీహారిక, బిగ్ బాస్ విన్నర్, సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ సహా మిగతావారికి నోటీసులు అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు. 

Updated Date - 2022-04-03T19:29:27+05:30 IST

Read more