సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Gabbar singh: హరీష్‌కు బండ్ల కాస్ట్లీ గిఫ్ట్..

ABN, First Publish Date - 2022-05-12T15:55:19+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో గబ్బర్ సింగ్ (Gabbar singh) కూడా ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్ళు పూర్తైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో గబ్బర్ సింగ్ (Gabbar Singh) కూడా ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్ళు పూర్తైంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్‌ (Harish Shankar)కు చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన దబాంగ్ (Dabangg) సినిమా 2010లో వచ్చి హిందీలో భారీ హిట్ సాధించింది. ఈ సినిమాతో ప్రముఖ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. సల్మాన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద దబాంగ్ భారీ హిట్ సాధించడంతో ఈ చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని డిసైడయి దర్శకుడిగా హరీష్ శంకర్‌ను ఎంచుకున్నాడు. అలాగే, పవన్ సలహా మేరకు హీరోయిన్‌గా శృతి హాసన్ ఫిక్సైంది. ఒరిజినల్ కథలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని హరీష్ శంకర్ చేసిన మార్పులు చేర్పులు గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ సాధించడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద ఎసెట్ అని చెప్పాలి.


గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా పవన్ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ..అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే, 2012 మే 11న విడుదల రిలీజైన ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్‌కు దాదాపు రూ.5 లక్షల విలువ చేసే ఓమెగ శేమస్తెర్ అనే లగ్జరీ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా, స్వయంగా బండ్ల గణేశ్ ఈ వాచ్‌ను హరీష్ శంకర్ చేతికి పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, పవర్ స్టార్‌తో మరో చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు బండ్ల గణేష్ ఇప్పటికే ప్రకటించాడు. 

Updated Date - 2022-05-12T15:55:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!