సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dasara : ఆకట్టుకుంటోన్న ‘ఫ్రెండ్ షిప్ డే’ స్పెషల్ పోస్టర్

ABN, First Publish Date - 2022-08-07T22:02:47+05:30

నేచురల్ స్టార్ నానీ (Nani) హీరోగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నానీ (Nani) హీరోగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీర్తిసురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) సంగీతం అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ (Satyan Suryan) ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 


సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో వెరైటీ ప్రేమ కథాచిత్రంగా రూపొందుతోంది. ఇదివరకు విడుదలైన ‘దసరా’ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (ఆదివారం) ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day) సందర్భంగా దసరా చిత్రానికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.నానీ, సింగరేణి బొగ్గుగనుల్లో పనిచేస్తున్న అతడి గ్యాంగ్ ఈ పోస్టర్‌లో రివీలయ్యారు.


ప్రేక్షకులకు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ.. ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం.. అంటూ నిర్మాతలు ట్విట్టర్ వేదికగా పోస్టర్ ను వదిలారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం నానీ కొన్ని కిలోల బరువు తగ్గారు. ఈ సినిమాలో గెడ్డంతో ఉన్న నానీ మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం నానీ తన కెరీర్లోనే పూర్తి తెలంగాణ యాసలో డైలాగ్స్ పలకబోతున్నారు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ అభిమానుల్ని అలరించబోతున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. 



Updated Date - 2022-08-07T22:02:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!