Flora shaini: భయంతో బట్టలు లేకుండా పరిగెత్తాను!
ABN , First Publish Date - 2022-12-08T20:26:43+05:30 IST
హీరోయిన్ ఫ్లోరా షైనీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తన జీవితం కూడా శ్రద్థా వాకర్‌లాగే అయ్యేదని చెప్పుకొచ్చారు. ‘చాలా బాగుంది’, నువ్వు నాకు నచ్చావ్, నరసింహనాయుడు, ప్రేమతో రా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
హీరోయిన్ ఫ్లోరా షైనీ (Flora shaini shocking comments) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తన జీవితం కూడా శ్రద్థా వాకర్‌లాగే అయ్యేదని చెప్పుకొచ్చారు. ‘చాలా బాగుంది’, నువ్వు నాకు నచ్చావ్, నరసింహనాయుడు, ప్రేమతో రా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె వ్యక్తిగత విషయాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘శ్రద్థా వాకర్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నా బాయ్ ఫ్రెండ్ నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశాడు. నేను నా వాళ్లను వదిలి బయటకు వచ్చిన కొద్ది రోజులకే అతనిలో చాలా మార్పు కనిపించింది. తన కోసం నా వాళ్లు అందరినీ వదిలి వస్తే నన్ను తీవ్రంగా హింసించేవాడు. పిచ్చి వాడిలా ప్రవర్తించేవాడు. కారణం లేకుండా కొట్టేవాడు. అతని దెబ్బలకు నా దవడ విరిగింది. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టడమే కాదు చంపేస్తానంటూ బెదిరించాడు. దాంతో నేను ఒంటిపై బట్టలు ఉన్నాయా అన్నది కూడా చూడకుండా ప్రాణభయంతో పరుగుతీశాను. అప్పుడే మా అమ్మ వచ్చి తన వెంట ఇంటికి తీసుకెళ్లింది అలా ప్రాణంతో బయటపడ్డాను. ఆ తర్వాత అతనిపై కేసు పెట్టా. మదట పోలీసలు నా మాట నమ్మలేదు. రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు’ అని ఫ్లోరా షైనీ అన్నారు.